Header Banner

స‌చివాల‌యంలో మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే! రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌!

  Mon Apr 14, 2025 20:03        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీల‌క అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు జరిగే సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!


ఏపీ క్యాబినెట్.. చర్చించే అంశాలివే..
సీఆర్డీయే 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం సీఆర్డీయే కమిష‌నర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై సీఆర్డీయే అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్లో అనుమతి లభించనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూత‌న అసెంబ్లీ, హైకోర్ట్ భ‌వ‌నాల టెండ‌ర్ల‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం క్యాబినెట్‌లో గ్రీన్ సిగ్న‌ల్ పడనుంది. కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు.. 32,133 ఉద్యోగాలు కల్పించే ప్ర‌తిపాద‌న‌ల‌కూ ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCabinet #ChandrababuNaidu #AmaravatiCapital #APDevelopment #CRDA